ముంబైలో నేను మిస్ అవుతుంది అది ఒక్కటే: కంగనా

ముంబైలో నేను మిస్ అవుతుంది అది ఒక్కటే: కంగనా

ధర్మశాల: బాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న నటి కంగనా. తన దైన వివాస్పద వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్ అనే పేరు తెచ్చుకుంది. కంగనా ఏటువంటి ట్వీట్ చేసినా ఈ సారి ఏం కాంట్రవర్సీ చేస్తందా అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే కంగనా కొత్తగా ఓ ట్వీట్‌ చేసింది. అందులో తాను ముంబైలో మిస్ అవుతుంది అదొక్కటే అంటూ తన ట్వీట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కంగనా మనాలీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిల క్రితం తాను మహరాష్ట్ర పోలీసుల పనితీరుపై చాలా నిరాశ పడినట్లు కంగనా తెలపింది. ఆ తరువాత ముంబైలో ఉండటం తనకు మంచిది కాదంటూ ట్వీట్ చేసింది. దాంతో అప్పటి నుంచి కంగనా మనాలీలో నివాసం ఉంటుంది. అయితే మనలాలీలో గత కొన్ని నెలలుగా ఉండేసరికి ముంబైలో తాను చేసే గుర్రపు స్వారీని బాగా మిస్ అవుతున్నాని చెప్పింది. ‘ నేను ఎప్పుడూ అంతగా క్రీడల్లో ప్రవేశం లేదు. కానీ ముంబైలో రోజు పోద్దున్నే గుర్రపు స్వారీ చేస్తుంటే బాలా బాగుండేది. మనం మరో జంతువుతో మానసికంగా ఒకటైతే ఆ అనుభూతో వేరుగా ఉంటుంద’ని కంగనా తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.