నరేష్ గోయల్ కు ఐటీ షాక్!

నరేష్ గోయల్ కు ఐటీ షాక్!

తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.650 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నరేష్ గోయల్ కు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరులో ముంబయిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌లో అధికారులు సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌, దుబాయిలోని ఎయిర్‌లైన్‌ గ్రూప్‌ కంపెనీకి మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయిలోని జనరల్‌ సేల్స్‌ ఏజెంట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా భారీ మొత్తంలో కమిషన్లు ముట్టజెప్పినట్లు దర్యాప్తు నివేదికలో తెలిపారు. ఆదాయపు పన్ను చట్టం కింద ఉన్న పరిమితులను దాటి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది.