గంగూలీకి సీఎం కావాలనుందేమో?: పాక్‌ మాజీ క్రికెటర్‌

గంగూలీకి సీఎం కావాలనుందేమో?: పాక్‌ మాజీ క్రికెటర్‌

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత-పాక్‌ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మూడు రోజుల క్రితం గంభీర్‌ చేసిన వ్యాఖ్యలకు అఫ్రిది తలతిక్కగా జవాబివ్వగా.. ఇప్పుడు సౌరవ్‌ గంగూలీపై జావేద్‌ మియందాద్‌ పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే కాదు.. అన్ని క్రీడాంశాల్లోనూ పాక్‌తో తలపడకుంటేనే మేలని గంగూలీ నిన్న అభిప్రాయపడ్డాడు. దీనికి మియాందాద్‌ స్పందిస్తూ..

'పాక్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను భారత్‌ బహిష్కరిస్తే అది అనాలోచిత చర్యే. అలా బహిష్కరించేందుకు ఐసీసీ కూడా ఆమోదించదు. భారత్‌లో జరగబోయే ఎన్నికల్లో సౌరవ్‌ గంగూలీ పోటీ చేసి సీఎం కావాలని అనుకుంటున్నాడేమో. అందుకే.. గంగూలీ అలా వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రజల మద్దతు కోసం గంగూలీ ప్రయత్నిస్తున్నట్టే కనబడుతోంది' అని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16 భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.