విలన్ పాత్రలు భవిష్యత్ లో చేస్తా..

విలన్ పాత్రలు భవిష్యత్ లో చేస్తా..

రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  అటు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే.  ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రివెంజ్ స్టోరీగా తెరకెక్కించాడు.  ఈ సినిమాలోని అమర్ పాత్ర అందరికి నచ్చుతుందని రవితేజ అంటున్నాడు.  

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమని, భవిష్యత్ లో విలన్ క్యారెక్టర్లు చేస్తానని రవితేజ చెప్తున్నాడు. ఇడియట్ సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ మాస్ మహారాజ అమర్ అక్బర్ ఆంటోనితో ఎలా మెప్పిస్తాడో రేపు తేలిపోతుంది.