ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. సత్తా చూపిస్తా..

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. సత్తా చూపిస్తా..

బీసీల సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ చెప్పారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బీసీ ఓట్లు కావాలిగానీ బీసీలకు సీట్లు ఇవ్వారా అని ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న తనకు టికెట్‌ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. బీసీలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్యాయం చేశారని ఆరోపించిన భిక్షపతి యాదవ్‌.. రాష్ట్ర నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇండిపెండెంట్‌గా 17వ తేదీన నామినేషన్‌  వేస్తానని ఆయన ప్రకటించారు.