ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా..

ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా..

ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రిప్లయ్‌ కోసం చూస్తున్నానని చెప్పారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరుతానని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలో చాలా మంది సమర్థించారని చెప్పారు.