నేను రాజీనామా చేస్తాః టీఆర్ఎస్ ఎమ్మెల్యే

నేను రాజీనామా చేస్తాః టీఆర్ఎస్ ఎమ్మెల్యే

జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం తాను పదవీ త్యాగం చేస్తానని చెప్పారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరతానన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్‌ నగర్‌ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు. కవిత పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఘోరపరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆమె బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో  70 వేల 875 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.