ఖమ్మంలో నా గెలుపు ఖాయం..

ఖమ్మంలో నా గెలుపు ఖాయం..

లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఆ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి... లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజాస్వామ్యంలో కీలకమైన అంశం  పారదర్శకంగా ఎన్నికలు జరగడమే అన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరగ కూడదు... కానీ, తెలంగాణలో పెద్ద ఎత్తున 5 గంటల తర్వాత ఓటింగ్ నమోదు కావడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు  చేవామని తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వెల్లడించిన రేణుకాచౌదరి... ఖమ్మంలో నా గెలుపు ఖాయం.. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కూడా గెలవాలనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందన్నారు. మరోవైపు ఇంటర్ ఫలితాల్లో అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించిన రేణుకా.. ఎంతో వేధనచెందిన ఆ విద్యార్ధుల తల్లుల ఉసురు తగలడం ఖాయమన్నారు.