పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ను అభినందన్ కూల్చేశాడు

పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ను అభినందన్ కూల్చేశాడు

ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్ ఎఫ్-16ను వింగ్ కమాండర్ అభినందన్ వర్థమానే కూల్చేశాడని భారతీయ వాయుసేన ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఎఫ్-16ని కూల్చేందుకు అభినందన్ ఆర్-73 మిస్సైల్ వాడినట్టు తెలిపారు. అమరామ్ మిస్సైల్ తో మిగ్ 21 బైసన్ ని టార్గెట్ చేయడానికి ముందే అభినందన్ దాడి చేశాడు. దీంతో పాకిస్థాన్ ఎఫ్-16లను ఉపయోగించినట్టు స్పష్టమైంది.

వైమానిక దాడి సమయంలో అభినందనే పాకిస్థాన్ యుద్ధ విమానంపై మిస్సైల్ ప్రయోగించినట్టు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ తాకడానికి ముందు అభినందన్ తన చివరి రేడియో ట్రాన్స్ మిషన్ లో తను మిస్సైల్ ప్రయోగించినట్టు చెప్పాడు.

పాకిస్థాన్ ఎఫ్-16ని కూల్చేయడంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఖండించేందుకు ఐఏఎఫ్ ఈ ప్రకటనను జారీ చేసింది. 28 ఫిబ్రవరి 2019న విడుదల చేసిన ప్రకటనలో మిగ్-21 బైసన్ పాకిస్థాన్ ఎఫ్-16ను కూల్చేసినట్టు పేర్కొన్నట్టు ఐఏఎఫ్ తెలిపింది. వింగ్ కమాండర్ అభినందన్ సోషల్ మీడియాలో లేరని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఆయనకు ఎలాంటి అకౌంట్ లేదని, అందువల్ల అలాంటి నకిలీ అకౌంట్లను ఫాలో కావద్దని సూచించింది.