పాక్ కట్టుకథలకు ఇండియా చెక్.. సాక్ష్యం ఇదే.. 

పాక్ కట్టుకథలకు ఇండియా చెక్.. సాక్ష్యం ఇదే.. 

ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా రగడ జరుగుతున్నది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ రగడ మరింతగా పెరిగింది.  రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా చాలావరకు బ్రేక్ అయ్యాయి.  దీని వలన ఇండియాకు వచ్చిన ఇబ్బంది ఏమిలేదు.  పాకిస్తాన్ కు మాత్రం భారీ నష్టం వస్తోంది.  అయితే, దేశం ఎంతగా నష్టపోయినా.. పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజల పక్షానే నిలుస్తుందని పాక్ ప్రభుత్వం చెప్తున్నది.  

ఇక బాలాకోట్ దాడుల సమయంలో ఇండియాకు చెందిన సుఖోయ్ 30 ఎంకెఐ అనే యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్టుగా అప్పట్లో పాక్ పేర్కొన్నది.  అయితే, అదే యుద్ధవిమానం రోజు 87వ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా పెరేడ్ లో పాల్గొన్నది మూడు మిరాజ్ యుద్ధవిమానాలు, రెండు సుఖోయ్ 30 ఎంకెఐ యుద్ధ విమానాలు ఈ పెరేడ్ లో పాల్గొన్నాయి. కాగా, అవెంజర్ 1 గా చెప్పబడిన సుఖోయ్ యుద్ధవిమానాన్ని గతంలో పాక్ కూల్చేసినట్టు పేర్కొన్నది.  అవన్నీ అబద్దాలే అని ఇప్పుడు తేలిపోయింది.  ఆరోజు పాక్ చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని ఇండియా కూల్చేసింది.