'వీర్ చక్ర'కు వింగ్ కమాండర్ అభినందన్ పేరు పంపిన ఐఏఎఫ్

'వీర్ చక్ర'కు వింగ్ కమాండర్ అభినందన్ పేరు పంపిన ఐఏఎఫ్

భారతీయ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పేరును 'వీర్ చక్ర' అవార్డు పరిశీలనకు పంపింది. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ వైపు నుంచి జరిగిన వైమానిక యుద్ధంలో అభినందన్ అనన్య సాహసంతో పాకిస్థాన్ కి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన 12 మిరాజ్ 2000 పైలెట్ల పేర్లను కూడా వాయుసేన మెడల్ పరిశీలనకు పంపారు. శనివారం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఐఏఎఫ్ వర్గాలు విడుదల చేశాయి.

యుద్ధ సమయంలో ఇచ్చే మూడో వీరత్వ పతకం వీర్ చక్ర. యుద్ధ సమయంలో అసాధారణ వీరత్వం, ప్రాణత్యాగం చేసిన సైనిక వీరులను గౌరవిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అభినందన్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఐఏఎఫ్ ఆయన పోస్టింగ్ ను శ్రీనగర్ నుంచి మారుస్తూ పాకిస్థాన్ సరిహద్దుల్లోని పశ్చిమ ఎయిర్ బేస్ ప్రాంతానికి బదిలీ చేసింది.