అభినందన్ ను రేపు విడుదల చేస్తాం

అభినందన్ ను రేపు విడుదల చేస్తాం

నిన్న పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ వర్థమాన్ ను రేపు విడుదల చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇవాళ పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతి కోరుకుంటున్న సూచనగా ఈ చర్య చేపడుతున్నట్టు చెప్పారు. ఇది తమ చర్చల ప్రారంభం దిశగా మొదటి అడుగన్నారు. భారత్-పాక్‌ ల మధ్య తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్టు తెలిపారు. పుల్వామా దాడికి సంబంధించిన సాక్ష్యాధారాలతో భారత్ పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కు అందజేసిన పత్రాలు తనకు చేరాయని చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలో తాను మోడీతో టెలిఫోన్ లో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రమే తాను మోడీతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించినట్టు పార్లమెంట్ కు తెలిపారు.