నా ప్రతి అవకాశంలో 100శాతం ప్రయత్నిస్తా...కానీ..

నా ప్రతి అవకాశంలో 100శాతం ప్రయత్నిస్తా...కానీ..

షార్జా: ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌కు వెల్లేందుకు జట్లు చాలా కష్ట పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హదరాబాద్ మధ్య పోరులో ఒక్క వికెట‌్‌ కూడా కోల్పోకుండా ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది. ముంబై ఇచ్చిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్‌కు బాటను సిద్దం చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ బౌలర్ షబాజ్ నదీమ్ మాట్లాడాడు. అయితే తాను ఎంత కష్టపడినా తనకు సరైన అవకాశాలు రావడం లేదని అన్నాడు. ‘నేను నా ప్రతి అవకాశంలోనూ నా 100శాతాన్ని అందిస్తాను. కానీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడటానికి అవకాశాలు రావటంలేదు. ఇప్పటికి నీ క్యారమ్ బాల్స్ పై దృష్టి పెట్టా, వాటిని సరైన సందర్భంలో, సరైన ప్రత్యర్థిపైన కచ్చితంగా వాడతా’నని నదీమ్ చెప్పాడు. అయితే తాను గత రెండు సంత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నాడని, కానీ తనకు ఎక్కువ ఆటలు ఆడేందుకు లభించడంలేదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 7.14 ఎకానమీని మెయంటెన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మనం మన జట్టుకు ఆడుతున్నాప్పుడు అది మనలను మరింత ఉత్తేజపరుస్తుందని, అప్పుడే మనమేంటో నిరూపించుకోగలుగు తామని తెలిపాడు.