మీడియా వార్తలను ఖండించిన రత్నప్రభ

మీడియా వార్తలను ఖండించిన రత్నప్రభ

బీజేపీలో తాను చేరటం లేదని మాజీ చీఫ్ సెక్రటరీ కె.రత్నప్రభ స్పష్టం చేశారు. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెప్పారు.  మీడియా వస్తున్న వార్తలను రత్నప్రభ ఖండించారు. ఈ వార్తలు తనను చాల ఇబ్బంది పెట్టాయని ఆమె పేర్కొన్నారు. రత్నప్రభ బీజేపీలో చేరనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గెపై పోటీ చేయనున్నారని కొందరు నేతలు ప్రచారం చేశారు. 1981 వ బ్యాచ్ కి చెందిన రత్నప్రభ చీఫ్ సెక్రెటరిగా పనిచేశారు. రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో కూడా ఆమె పనిచేశారు. మార్చి 31న రత్నప్రభ పదవీ విరమణ చేశారు. ఆమె పదవిని మరో మూడు నెలలు పొడిగించాలని కర్నాటక సీఎం కుమారస్వామి మొదట్లో భావించినా.... అది జరగలేదు. కర్నాటకలో పలువురు అధికారులు పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రత్నప్రభ కూడా బీజేపీలో చేరనున్నారని పలువురు భావించారు. అయితే... ఈ వార్తలను ఆమె ఖండించారు.