నేను భారీ మెజార్టీతో గెలువబోతున్నా

నేను భారీ మెజార్టీతో గెలువబోతున్నా

కరీంనగర్ స్థానంలో తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో వినోద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. అలాగే మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. వినోద్‌ కుమార్‌ ఎంపీగా గెలిస్తే.. కేంద్రమంత్రి అవుతారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ కు భారీ మెజార్టీ వస్తుందన్నారు. అన్ని కుల సంఘాలు, కరీంనగర్ ప్రజలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయమని అన్నారు.