డబ్బు, మద్యం పంచితే పిర్యాదు చేయండి !

డబ్బు, మద్యం పంచితే పిర్యాదు చేయండి !

జాయింట్ సీఈవో ఆమ్రపాలి ఎన్నికల ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ 'పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం.  ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని ఒక్కో అధికారి పర్యవేక్షిస్తారు.  గ్రూప్ వన్ అధికారులను నియమించాం.  ఎప్పటికప్పుడు పోల్ పర్సంటేజ్, సమస్యలు తెలెత్తితే అప్రమత్తం చేయడానికి ఈ సెల్ పని చేస్తుంది.  వెబ్ కాస్టింగ్ కూడా మానిటర్ చేస్తారు' అన్నారు. 

ఇక 'ఎక్కడన్నా డబ్బులు, మద్యం పంచుతుంటే సి విజిల్ ద్వారా పిర్యాదు చేయవచ్చు.  ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నా ఓట్ యాప్ ఏర్పాటు చేశాం.  ఈ యాప్ ద్వారా ఓటుతో పాటు పోలింగ్ స్టేషన్ ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు' అన్నారు.