49 మంది ఐపీఎస్, ఐఏఎస్ లకు పదోన్నతులు

49 మంది ఐపీఎస్, ఐఏఎస్ లకు పదోన్నతులు

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా, నలుగురు ఐపీఎస్‌ అధికారులకు ఐజీలుగా పదోన్నతి దక్కింది. ఏడుగురు ఐపీఎస్‌లకు డీఐజీలుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, ఆరుగురు ఐపీఎస్‌లకు సీనియర్‌ స్కేల్‌ అధికారులుగా పదోన్నతి కల్పించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ఐపీఎస్‌ అధికారికి ఐజీగా పదోన్నతి ఇచ్చింది. కార్తికేయ, రమేశ్‌ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు ఐపీఎస్‌ అధికారులకు డీజీలుగా పదోన్నతి లభించింది. అవినాశ్‌ మహంతి, విశ్వప్రసాద్‌, ఎం. రమేశ్‌లకు డీఐజీలుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శులు, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఒకరికి ముఖ్యకార్యదర్శి, నలుగురికి కార్యదర్శులుగా, నలుగురు ఐఏఎస్‌లకు డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోషన్‌ లభించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఉన్నతాధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ.. 15 జీవోలను జారీ చేసింది.