శశాంక్ గోయల్‌కు పుత్రశోకం...

శశాంక్ గోయల్‌కు పుత్రశోకం...

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్(24) దారుణ హత్యకు గురయ్యారు. ఢిల్లీలో ఓ పెళ్లికి శుభమ్ గోయల్ హాజరయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో తన స్నేహితులతో కలిసి టర్కీ పర్యటనకు వెళ్ళాడు. టర్కీలోని ఇస్తాంబుల్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో శుభమ్ గోయల్ మృతి చెందాడు. ఈ ఘటన వివరాలు ఈ నెల 26న శుభమ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. శుభమ్ గోయల్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని రూర్కీ. శుభమ్ మృతదేహాన్ని రూర్కీకి తరలించారు. ఈ ఘటనతో శుభమ్ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుభమ్ గోయల్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. 

Photo: FileShot