ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు

పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. రామ్ ప్రకాష్ సిసోడియాకు ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శిగా నాగుల పల్లి శ్రీకాంత్, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.దమయంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్.ఎస్ రావత్ కు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ ను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.