అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరీ !

అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరీ !

ఢిల్లీ అల్లర్లలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆప్ కౌన్సిలర్  తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందని బిజెపి ఆరోపిస్తోంది. తాహిర్ మరియు అతని మద్దతుదారులు అంకిత్ శర్మను చంపినట్లు ఆరోపిస్తున్నారు బిజెపి నేతలుచంద్ బాగ్ లోని ఆప్ నాయకుడు, మునిసిపల్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు చెందిన భవనం నుండి కొంతమంది వ్యక్తులు రాళ్ళు రువ్వారని అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అంకిత్ పై  దాడి చేశారని అంటున్నారు. కౌన్సిలర్ తాహిర్ ఈశాన్య ఢిల్లీలోని షాహదారా, నెహ్రూ నగర్, చాంద్‌ బాగ్ ప్రాంతంలో పట్టున్న వ్యక్తి. 

ఇక ఆయన పోస్టుమార్టం నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వచ్చాయి. దుండగులు అతడి శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా కత్తితో తూట్లు పొడిచినట్టు తేలింది. అంకిత్ శర్మ శరీరంపై 400కు పైగా కత్తి గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది. గంటల తరబడి అంకిత్ శర్మను దుండగులు చిత్ర హింసలకు గురిచేశారని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. 4 నుంచి 6 గంటలపాటు అంకిత్ శర్మను పదునైన ఆయుధాలతో చిత్ర హింసలకు గురి చేసిన దుండగులు రాక్షసానందం పొందారని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అతణ్ని ఎంత దారుణంగా చంపారంటే కత్తి పోట్ల ధాటికి పొట్టలోని పేగులు చిధ్రమైపోయాయి. ఓ వ్యక్తిని ఇంత దారుణంగా కసితీరా తూట్లు తూట్లుగా పొడిచి చంపడాన్ని తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. 

ఫిబ్రవరి 26న ఖజారి చాంద్ బాగ్ నాలాలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్ బాడీలను పరిశీలించగా..మిస్పింగ్ అయిన..ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న యువకుడు అంకిత్ శర్మగా గుర్తించారు. అంకిత్ శర్మను కత్తులతో దాడి చేసి.. ఈడ్చుకెళ్లి..నాలాలో ఆందోళనకారులు పడేశారు. కళ్లు పీకేసి..గొంతు కోసి దారుణంగా హతమార్చారని తేలింది. ఇక అంకిత్ శర్మ హత్యలో  ఆప్ నేత పాత్ర ఉందనే ఆరోపణలపై పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అటువంటి సంఘటనలకు పాల్పడేవారిని ఎవరినీ సహించకూడదని, వాళ్లు ఏ పార్టీకి చెందినవారైనా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఆప్ కు చెందినవారు అటువంటి ఘటనలకు పాల్పడితే రెండింతల శిక్ష వేయవచ్చునని ఆయన అన్నారు.