టెస్టు ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు...

టెస్టు ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు...

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఐసీసీ. ఫైనల్‌ పోరు జూన్‌ 18 నుంచి 22 వరకు జరగనుంది. జూన్‌ 23ను రిజర్వ్‌డేగా ప్రకటించారు. అయితే ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం లార్డ్స్‌ గ్రౌండ్‌లో  జూన్‌ 10 నుంచి 14 వరకు ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ అప్పుడే ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ ఉండే అవకాశం ఉండటంతో... ఐసీసీ కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో టీమిండియా టాప్‌ ప్లేస్‌లోకి చేరింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌-2లో ఉన్న భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.