బంగ్లాదేశ్ టార్గెట్ః 382

బంగ్లాదేశ్ టార్గెట్ః 382

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166; 147బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సులు)  మరోసారి రెచ్చిపోయాడు. ఖవాజా(89; 72బంతుల్లో 10 ఫోర్లు), ఫించ్‌(53; 51బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.  బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా, రహమాన్‌కు ఓ వికెట్ దక్కింది.