వరల్డ్ కప్ ఫీవర్: ఆకట్టుకుంటున్న గూగుల్ డూడుల్..
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సమరానికి ఇవాళే తెరలేవనుంది. క్రికెట్‌కు పుట్టిన ఇల్లు అయిన ఇంగ్లండ్ గడ్డపై క్రికెట్ వరల్డ్ కప్ 2019కు సర్వం సిద్ధమైంది. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ‘Google’ అన్న అక్షరాల్లో ‘o’ అక్షరాన్ని బంతితో ‘L’ అక్షరాన్ని వికెట్స్‌తో, మధ్యలోంచి బౌలర్ బంతి వేస్తున్నట్లుగా డూడుల్‌ను డిజైన్ చేశారు. ప్రతీ ప్రత్యేకమైన రోజు, పండుగలకు, ప్రముఖులు జయవంతులు, వర్థంతుల సమయంలో ప్రత్యేక డూడుల్‌ను రూపొందించే గూగుల్... క్రికెట్‌పై రూపొందించిన డూడుల్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది. ఇక 10 జట్లు పాల్గొననున్న ఈ క్రికెట్ వరల్డ్‌లో 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)