బ్రేకింగ్ : టీ 20వరల్డ్ కప్ వాయిదా..మళ్ళీ ఎప్పుడంటే.!

  బ్రేకింగ్ : టీ 20వరల్డ్ కప్ వాయిదా..మళ్ళీ ఎప్పుడంటే.!

కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు తాజాగా టీ 20వరల్డ్ కప్ ను సైతం వాయిదా పడింది. 2020లో జరగాల్సిన టీ 20వరల్డ్ కప్ ను కరోనా విజృంభణ నేపథ్యంలో 2022కి వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) స్పష్టం చేసింది.  2022 లో ఆస్ట్రేలియాలో నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు న్యూజిలాండ్‌లో జరగాల్సిన ఐసిసి ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2021 ను కూడా మార్చి 2022 వరకు వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 యొక్క వ్యాప్తి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఐసిసి యాక్టింగ్ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా మాట్లాడుతూ ... "గత కొన్ని నెలలుగా మేము గ్లోబల్ ఈవెంట్లను ఎలా నిర్వహించాలో పరిశీలిస్తున్నాము, ఐసిసి ఈవెంట్లలో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటమే మాకు ముఖ్యం" అని అన్నారు.