బాల్ ట్యాంపరింగ్ చేస్తే.. కఠిన శిక్షలు

బాల్ ట్యాంపరింగ్ చేస్తే.. కఠిన శిక్షలు

భవిష్యత్తులో క్రికెట్ ను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కఠిన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం డబ్లిన్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం జరిగింది. ఇకపై బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ వెల్లడించారు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారు 6 టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 12 సస్పెన్షన్‌ పాయింట్లనూ ఆటగాడి ఖాతాలో విధిస్తారు. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం ఈ తప్పిదాన్ని లెవెల్‌-3కి మార్చారు.

ఇంతకుముందు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడితే ఒక టెస్ట్‌, రెండు వన్డేల నిషేధం విధించేవారు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆసీస్‌ క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొంటుండగా.. తాజాగా శ్రీలంక కెప్టెన్ చండిమాల్‌ కూడా బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఒక టెస్టు మ్యాచ్‌కు  దూరమయ్యాడు.