టాప్‌ ప్లేస్‌లోనే 'కోహ్లి'

టాప్‌ ప్లేస్‌లోనే 'కోహ్లి'

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. సౌతాంఫ్టన్ వేదికగా ముగిసిన నాలుగవ టెస్టులో కోహ్లి(46, 58) పరుగులు చేసాడు. దీంతో కెరీర్‌ అత్యత్తుమ రేటింగ్‌ పాయింట్లతో కోహ్లి నంబర్‌ వన్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు. మూడో టెస్టులో సెంచరీ చేయడంతో కోహ్లి 937 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరాడు. ప్రస్తుతం​ కూడా అవే రేటింగ్‌ పాయింట్లతో కోహ్లి అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇవి కోహ్లి కెరీర్‌లోనే అత్యధిక టెస్టు రేటింగ్‌ పాయింట్లు.

ఈ జాబితాలో చతేశ్వర పుజారా 798 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరుపున వీరిద్దరూ మాత్రమే ఐసీసీ టాప్ 10 ర్యాంకింగ్స్‌లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ 4 స్థానాలు దిగజారి 21 స్థానంలో ఉన్నాడు. నాలుగు టెస్టులో కలిపి కుక్ మొత్తం 109 పరుగులు చేసాడు. బెస్ట్ స్కోర్ 29.