ఐసీసీ వరల్డ్ కప్ 2019 అధికారిక గీతం విడుదల 

ఐసీసీ వరల్డ్ కప్ 2019 అధికారిక గీతం విడుదల 

ఇవాళ ఐసీసీ అన్ని స్ట్రీమింగ్ వేదికలపై పురుషులు ప్రపంచ కప్ అధికారిక గీతం 'స్టాండ్ బై'ని విడుదల చేసింది. మే 30 నుంచి ప్రారంభమవుతున్న టోర్నమెంట్ లో మైదానాలు, నగరాల్లో వరల్డ్ కప్ కి సంబంధించిన కార్యక్రమాల్లో దీనిని ప్లే చేస్తారు. 

'స్టాండ్ బై' గీతాన్ని కొత్త కళాకారుడు లోరిన్, బ్రిటన్ లో అత్యంత విజయవంతమైన, ప్రభావశీలురైన 'రుడిమెంటల్' బ్యాండ్ రూపొందించారు. ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలలో ఒకటి. 10 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. 48 మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలను టీవీల్లో కోట్లాది మంది చూడనున్నారు.

క్రికెట్ మహాకుంభమేళాలో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. జూలై 14 వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు మే 22న ఇంగ్లాండ్ కి పయనం కానుంది. క్రీడా నిపుణుల ప్రకారం ఆతిథ్య ఇంగ్లాండ్, టీమిండియా ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నాయి.