కోహ్లీకి నో ఛాన్స్..! మనవాళ్లు ఇద్దరే..

కోహ్లీకి నో ఛాన్స్..! మనవాళ్లు ఇద్దరే..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ముగిసింది... ఆదివారం అత్యంత ఉత్కంఠరేపుతూ సాగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచి కొత్త రికార్డును సృష్టించింది. అయితే మెగా టోర్నీలో అన్ని జట్ల నుంచి కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక, టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేసింది. 12 మంది పేర్లను ప్రకటించింది.. 11 మందితో టీమ్... 12వ ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్‌ను ఎంపిక చేశారు. ఈ టీమ్‌లో టీమిండియా నుంచి హార్డ్‌హిట్టర్ రోహిత్ శర్మ, యువ స్పీడ్‌స్టర్ బుమ్రాకు మాత్రమే చోటు దక్కగా... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ టీమ్‌లో చోటు దక్కలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ కెప్టెన్‌గా.. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని వికెట్ కీపర్‌గా ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్‌కు ఎంపిక చేశారు. 

ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్‌:
1. జేసన్ రాయ్(ఇంగ్లాండ్)
2. రోహిత్ శర్మ(భారత్)
3. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
4. రూట్(ఇంగ్లాండ్)
5. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)
6. బెన్‌స్టోక్స్(ఇంగ్లాండ్)
7. అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా)
8. మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
9. జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్)
10. ఫర్గుసన్(న్యూజిలాండ్)
11. జస్ప్రిత్ బుమ్రా(భారత్)
12. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)