2011 ప్రపంచ కప్  ఫైనల్లో  ఫిక్సింగ్ జరగలేదు : ఐసీసీ

2011 ప్రపంచ కప్  ఫైనల్లో  ఫిక్సింగ్ జరగలేదు : ఐసీసీ

భారతదేశం విజయం సాధించిన 2011 ప్రపంచ కప్ ఫైనల్ పై ఆందోళన చెందడానికి ఎటువంటి కారణాలు లేవని , అందులో ఫిక్సింగ్ జరగలేదని ఐసీసీ తెలిపింది. శ్రీలంక పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ దర్యాప్తు చేయాలని  క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే 2011 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ను అనుమానించడానికి మాకు ఎటువంటి ఆధారాలు లేవు అని ఐసీసీ యొక్క అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలను ఐసీసీ పరిశీలించింది, కానీ మేము సేకరించిన ఆధారాలలో ఎక్కడ ఆ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగింది అని రుజువు చేయలేకపోయాము" అంటూ ఎసియు అధిపతి పేర్కొన్నారు. కానీ ఐసీసీ పిలుపునిచ్చే ముందే...    ముగ్గురు మాజీ శ్రీలంక కెప్టెన్లు అరవింద డిసిల్వ (2011 ప్రపంచ కప్ సెలెక్టర్), కుమార్ సంగక్కర (కెప్టెన్) మరియు మహేలా జయవర్ధనే (ఫైనల్లో సెంచూరియన్) తమ స్టేట్‌మెంట్  ఇన్వెస్టిగేషన్ టీంకు ఇచ్చేసారు .