ఐసీసీ టెస్ట్ ర్యాంకిగ్స్... మనోళ్ళు ఎక్కడంటే...?

ఐసీసీ టెస్ట్ ర్యాంకిగ్స్... మనోళ్ళు ఎక్కడంటే...?

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతుండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా బాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇక బౌలర్ల విషయం లో పాట్ కమ్మిన్స్ నెంబర్ 1 గా నిలవగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో తన జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 862 పాయింట్లు సాధించి రెండో స్థానంలోకి వచ్చాడు. ఆల్ రౌండర్లలో హోల్డర్ మొదటి స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో స్థానంలో, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానంలో నిలిచాడు.