ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్... 4వ స్థానానికి పడిపోయిన కోహ్లీ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్... 4వ స్థానానికి పడిపోయిన కోహ్లీ

ఆసీస్-భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ ముందు వరకు టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ 3 వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే చివరి టెస్ట్ తర్వాత పుజారా ఏడో స్థానానికి ఎగబాకాగా రహానే 9వ స్థానానికి పడిపోయాడు. అలాగే గబ్బా టెస్ట్ లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 13వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ 8వ స్థానంలో, బుమ్రా 9వ స్థానంలో నిలిచారు. అలాగే ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో జడేజా 3వ స్థానంలో ఉండగా అశ్విన్ 6వ స్థానికి చేరుకున్నాడు.