టెస్టు రాంకింగ్స్.. టాప్ టెన్ లో కుక్

టెస్టు రాంకింగ్స్.. టాప్ టెన్ లో కుక్

టెస్టు ర్యాంకుల్లో ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ పదవ స్థానంతో తన కెరీర్ ను ముగించాడు. ఓవెల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 71, 147 పరుగులతో రాణించిన కుక్ బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో పదవ స్థానం పొందాడు. మొదటి నాలుగు మ్యాచ్ లలో 13, 0, 21, 29, 17, 17, 12తో దారుణంగా విఫలమైన కుక్.. రిటైర్మెంట్ ముందు మ్యాచ్ లో సత్తా చాటాడు.

కుక్ మొత్తం 161 టెస్ట్ మ్యాచ్ లలో 12,472 పరుగులు చేసాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్, పాంటింగ్, కలిస్, ద్రావిడ్ లు కుక్ కంటే ముందున్నారు. ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ అనంతరం కుక్ రిటైర్ అయ్యాడు.