టాప్ ప్లేస్‌లోనే కోహ్లీ, భారత్

టాప్ ప్లేస్‌లోనే కోహ్లీ, భారత్

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత జట్టుతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. టెస్ట్ సిరీస్‌లో రాణించిన విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా తన టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 922 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విల్లియమ్సన్ 897 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఛతేశ్వర్ పుజారా మూడో ర్యాంకులో.. రిషభ్ పంత్ 17వ ర్యాంకులో ఉన్నారు.

ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా టాప్ ర్యాంకులో నిలిచాడు. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఐదవ ర్యాంకు, రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నారు. జఫ్రీత్ బుమ్రా 15వ ర్యాంకులో ఉన్నాడు. ఇక తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 116 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లు ఉన్నాయి.