బంగ్లాదేశ్ కుర్రాళ్ల అతి : ఐసీసీ కన్నెర్ర !

బంగ్లాదేశ్ కుర్రాళ్ల అతి : ఐసీసీ కన్నెర్ర !

అండర్‌19 ప్రపంచకప్‌ ఫైనల్లో  కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై చర్యలు తీసుకోవడానికి ఐసీసీ రెడీ అయింది. బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురు ప్లేయర్లపై, భారత్ నుంచి ఇద్దరిపై చర్యలు తీసుకోనునట్లు ఐసీసీ ప్రకటించింది. బ్రీచింగ్‌ కోడ్‌ లెవల్‌ 3 కింద ఈ ఐదుగురిపై శిక్ష పడనుంది.  బంగ్లా నుంచి తవ్‌హిద్‌ హృదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్‌ హుస్సేన్‌, భారత్‌ నుంచి రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌ సింగ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. వస్తూనే భారత ఆటగాళ్ల మీదకు వెళ్తూ గేలి చేస్తున్నట్టుగా అరిచారు. ముఖ్యంగా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం భారత ఆటగాళ్లపై  అభ్యంతకర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఇక.. ఓ రిజర్వ్‌ ఆటగాడు ఏకంగా గొడవకు దిగడంతో సహించని ఓ భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేయడంతో అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవపై ఫైనల్‌లోని వీడియో ఫుటేజీలను పరిశీలించనున్నారు ఐసీసీ అధికారులు.