సిగ్నల్ సమస్య వల్ల భార్యతో ఫోన్ మాట్లాడటానికి ఇబ్బంది కలగడంతో...?

సిగ్నల్ సమస్య వల్ల భార్యతో ఫోన్ మాట్లాడటానికి ఇబ్బంది కలగడంతో...?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు వారి సిగ్నల్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు, వారే అంపైర్లు, అందులో ఒకరు ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి. ప్రస్తుతం కరోనా కారణంగా ఎటువంటి మ్యాచ్లు జరగకపోవడంతో తన ఇద్దరు కొడుకులని తీసుకొని ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత గ్రామమైన డాంగ్రోల్ కు వెళ్ళిపోయాడు. కానీ తన భార్య మాత్రం  ఢిల్లీలో ఇరుక్కుపోయారు. అయితే ఆ ఊరికి వెళ్ళాక తన భార్యతో ఫోన్ మాట్లాడటానికి సిగ్నల్ సమస్య ఉండటంతో మొదట అక్కడ ఉన్న ఎతైన చెట్లు ఎక్కి ఫోన్ మాట్లాడేవాడు. కానీ అలా మాట్లాడటం ఇబ్బందిగా అనిపించడంతో  ఒక టెలికం సంస్థను సంప్రదించి తన గ్రామంలో ఒక మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసాడు. దాంతో  ఆ గ్రామస్తుల సమస్యలను కూడ పరిష్కరించారు, మునుపటిల కాకుండా, నేను ఐసీసీ వీడియో సమావేశాలు అలాగే వర్క్‌షాపులకు హాజరవుతున్నాను. అంతే కాకుండా గ్రామంలోని విద్యార్థులకు కూడా ఏ సమస్య లేకుంగా ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారని,  గ్రామస్తులకు ఇది ఎంతో పెద్ద విషయం అని చౌదరి అన్నారు.