టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే..

టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే..

అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మెగా టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జరిగే మహిళల టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ షెడ్యూల్‌ను ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. మొత్తం పది దేశాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, క్వాలిఫయర్-1 జట్లు; గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇండియా, క్వాలిఫయర్-2 జట్లు ఉన్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనున్నది.