ఫించ్ సరికొత్త రికార్డు

 ఫించ్ సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫించ్‌ 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 153 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దీనికిముందు ఇంగ్లండ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు షేన్‌ వాట్సన్‌ పేరిట ఉంది. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఈ ఘనత సాధించాడు. తాజాగా దీనిని ఫించ్‌ బ్రేక్‌ చేసి నూతన రికార్డును నెలకొల్పాడు.