ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్
ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్' అని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నారు. వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ బయల్దేరడానికి ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి మంగళవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. 'వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యం.ప్రత్యర్థితో సంబంధం లేకుండా సన్నద్ధం కావడంపైనే ఇక మా దృష్టంతా. ఐపీఎల్లో ఆడటం వల్ల అలసిపోలేదు. ఇంగ్లాండ్‌లో అధిక పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. మా జట్టు ఆటపై ఫోకస్ పెట్టింది. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఎదుర్కోవడం అత్యంత ముఖ్యమైనది. తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదు. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. ఈ వరల్డ్‌కప్‌కు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉంది, మెరుగైన ప్రదర్శన చేయడమే తమ ముందున్న లక్ష్యం' అని కోహ్లి అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)