క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇక పండగే..
క్రికెట్ ఫ్యాన్స్‌కి అసలైన పండుగ ఇవాళే ప్రారంభం కానుంది... సగటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న క్రికెట్ సంబంరం... క్రికెట్ వరల్డ్ కప్ ఇవాళే ప్రారంభం కానుంది. కోట్ల నిరీక్షణలకు తెరదించుతూ, ఉత్తేజాన్ని పెంచేస్తూ.. అంతులేని వినోదాన్ని మోసుకుంటూ.. సకల హంగులూ హద్దుకుంటూ.. హద్దుల్లేని ప్రతిభను ఆవిష్కరించడానికి.. మీలో ఉత్సాహాన్ని నింపడానికి.. మిమ్మల్ని ఉద్వేగంలో ముంచేసి, ఉర్రూతలూగించడానికి ప్రపంచ క్రికెట్ కప్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ పుట్టిన గడ్డపైనే ప్రపంచకప్ 2019 సంబరం ఆరంభమవుతోంది. మొత్తం 10 జట్లు ఈ సిరీస్‌లో పాల్గొననుండగా... 46 రోజులు, 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. ఇక ఐసీసీ ప్రపంచకప్ బుధవారం అధికారికంగా ఆరంభమైంది. పది జట్ల కెప్టెన్లు బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలేస్ ముందు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ‘60 సెకన్ల ఛాలెంజ్’ పేరుతో రబ్బరు బంతితో సరదాగా గల్లీ క్రికెట్ ఆడించారు. ప్రతి జట్టు తరఫున ఇద్దరు బ్యాటింగ్ చేశారు. భారత్‌కు కుంబ్లే, ఫర్హాన్ అక్తర్ ప్రాతినిధ్యం వహించారు. జనాలే బౌలర్లు. ఒక నిమిషంలో వీలైనన్ని బంతులు వేశారు. ఇంగ్లాండ్ జట్టు 74 పరుగులతో విజేతగా నిలిచింది.
ప్రపంచకప్‌కు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మరింత ఆసక్తి రేపుతోంది. పొట్టి క్రికెట్‌తో రాటుదేలిపోయిన యువక్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్లు ఇలా ఒక్కో ప్లేయర్‌కి ఒక్కో ప్రత్యేకథ ఉంది. ఓ గేల్.. ఓ ధోని.. ఓ కోహ్లి.. ఓ బెయిర్‌స్టో.. ఈ విధ్వంసకారుల పరుగుల వర్షంలో సగటు క్రికెట్ అభిమాని సంతోషంగా తడిసిపోవచ్చు. అమ్ముల పొదినిండా బ్రహ్మాస్తాలను నింపుకున్న బుమ్రా.. రబాడ.. స్టార్క్.. రషీద్‌ల వికెట్ల వేటతో మురిసిపోవచ్చు. గరిష్ట వినోదానికి గ్యారంటీ! ఇక అందరిచూపూ ఇంగ్లాండ్‌పైనే ఉంది. కొన్ని జట్లు చిన్నవి కావొచ్చు.. ఇంకొన్ని పెద్దవి కావొచ్చు. కొన్ని జట్లు స్పష్టంగా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. ఈ విశ్వ సమరంలో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోలేం. తొలిసారి కప్పును అందుకోవడానికి ఇంతకన్నా సువర్ణావకాశముండదని జోరుమీదున్న ఇంగ్లాండ్ భావిస్తుంటే.. విజేతగా నిలవడానికి అన్ని వనరులు తనకున్నాయన్న ధీమాతో టీమ్ఇండియా ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)