ప్రాక్టిస్ లో విజయ్ శంకర్ కు గాయం

ప్రాక్టిస్ లో విజయ్ శంకర్ కు గాయం

ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలగగా, బౌలర్ భువనేశ్వర్ కుమార్ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. కాగా, టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కూడా గాయం బారిన పడ్డాడు. ప్రాక్టీస్ సెషన్ లో జస్ ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు విజయ్ శంకర్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో శనివారం ఆఫ్గానిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.