ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు కొత్త జెర్సీతో టీమిండియా

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు కొత్త జెర్సీతో టీమిండియా

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టులో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన ఆరెంజ్‌ జెర్సీ ధరించబోతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా ధరించే ఆరెంజ్‌ జెర్సీని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. నీలం, కాషాయ రంగుల్లో నూతన జెర్సీలు దర్శనమిచ్చాయి. ఇంగ్లాండ్‌ నీలం రంగు జెర్సీలను ధరిస్తుండటంతో బర్మింగ్ హామ్ మ్యాచ్‌లో టీమిండియా నూతన ఆరెంజ్‌ జెర్సీలతో బరిలోకి దిగనుందని కిట్ స్పాన్సర్‌ ధ్రువీకరించింది. టీమిండియా నీలం రంగు జెర్సీకు బదులుగా నూతన జెర్సీలను ధరించడం ఇదే ప్రథమం. 

ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్‌ రంగల మిళితంతో చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితిక కూడా ఈ జెర్సీపై స్పందిస్తూ అందంగా ఉందన్నారు. ఇక ఆరెంజ్‌ జెర్సీలో ఇంగ్లండ్‌ పని పట్టాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది. వాస్తవానికి అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌కు అఫ్గాన్‌ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగడంతో భారత్‌ యధాతథంగా బ్లూజెర్సీలనే
బరిలోకి దిగింది.