ఐసీఐసీఐ బ్యాంక్ వివాదం: 6 కంపెనీల్లో సోదాలు

ఐసీఐసీఐ బ్యాంక్ వివాదం: 6 కంపెనీల్లో సోదాలు

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చార్, ఆమె కుటుంబసభ్యులతో సంబంధం ఉన్నాయనే ఆరోపణలతో పలు సంస్థలపై దర్యాప్తు జరుగుతోంది. రుణగ్రహీతలతో చందా కొచ్చర్ వ్యవహరించిన తీరు, వడ్డీ వివాదం, క్విడ్ ప్రోకో ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ వివాదంలో నుపవర్ సహా మరో ఐదు ఇతర కంపెనీల్లోనూ తనిఖీలు ప్రారంభించామని వెల్లడించారు కేంద్రమంత్రి పీపీ చౌదరి. కంపెనీల చట్టం 206 (5) కింద ఐసీఐసీఐ బ్యాంక్ వివాదంతో సంబంధం ఉన్న ఆరు కంపెనీల్లో తనిఖీలు చేయాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించిందని తెలిపారు. 206 సెక్షన్ కింద సమాచారం కోరడం, రికార్డులను తనిఖీ చేయడం, సంబంధితులను విచారించే అధికారం ఉంటుందన్నారు. 

కొచ్చార్, ఆమె కుటుంబ సభ్యులందరూ వీడియోకోన్ గ్రూపుకి ఇచ్చిన రుణంలో క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వీడియోకాన్‌ ద్వారా చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్ యజమానిగా ఉన్న నుపవర్ కంపెనీకి డబ్బు పంపుతున్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్బీఐ, సీబీఐ, సెబీలు కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించాయి.