ఐసీఐసీఐకి డైమండ్ కంపెనీ రూ.87.67కోట్లు టోపీ

ఐసీఐసీఐకి డైమండ్ కంపెనీ రూ.87.67కోట్లు టోపీ

 తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని డైమండ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు కేసు పెట్టింది. ముంబయికి చెందిన ష్రెనుజ్ అండ్ కంపెనీ సుమారు 12 మిలియన్ డాలర్లు బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంది. ఆ అప్పును తిరిగి చెల్లించకుండా బ్యాంకును మోసం చేసింది. దీంతో ఆ డైమండ్ కంపెనీ, పదకొండు మంది ఎగ్జిక్యూటివ్స్ పైనా కేసులు పెట్టారు. దివాల తీసే ప్రయత్నం చేస్తోంది. తీసుకున్న డబ్బు మొత్తాన్ని యూఎస్, యూఏఈ ల్లోని షెల్ కంపెనీల్లోకి మళ్లించారని బ్యాంకు తెలిపింది. కంపెనీ ఆర్ఐసీఓ చట్టాన్ని పలుమార్లు ఉల్లంఘించారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ కంపెనీపై ఐసీఐసీఐ న్యూయర్క్ బ్రాంచ్  ఆర్ఐసీఓ ఉల్లంఘన చట్టం కింది  సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. గత ఆగస్ట్ లో ముంబయిలో ష్రెనుజ్ పై ఎన్సీఎల్టీ కింద కేసు నమోదు అయింది.