ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం ఓకే

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం ఓకే

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,604 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ. 1,650 కోట్లు. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 16,832 కోట్ల నుంచి రూ. 20,163 కోట్లకు పెరిగింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ నికర ఎన్‌పీఏల శాతం మొత్తం రుణాల్లో 4.20 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 2.58 శాతానికి తగ్గడంతో మార్కెట్‌లో ఈ షేర్‌కు గట్టి మద్దతు లభించింది. అమెరికా ప్రీ మార్కెట్‌లో షేర్‌ 8 శాతంపైగా లాభపడి 10.49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.