ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. సగానికి తగ్గినా..
మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సగానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.2024 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే లాభం రూ.1020 కోట్లకు క్షీణించింది. అయితే మార్కెట్ వర్గాలు మాత్రం బ్యాంక్ నికర లాభం రూ.980 కోట్లు మాత్రమే ఉండొచ్చని అంచనా వేశాయి. ఈ లెక్కన చూస్తే బ్యాంక్ పనితీరు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని చెప్పాలి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నిరర్థక ఆస్తులు ఏకంగా 128 శాతం పెరిగి రూ.6,625 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో నిరర్థక ఆస్తుల విలువ రూ.2,898 కోట్లు మాత్రమే. కేవలం బ్యాంక్ లెక్కలనే తీసుకుంటే.. బ్యాంక్ వడ్డీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.5962 కోట్ల నుంచి రూ. 6021 కోట్లకు పెరిగింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)