షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్..

షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్..

తన ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్ చెప్పింది ప్రైవేటు బ్యాకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు... ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వీకరిస్తుండగా.. తాజా నిర్ణయంతో ఇకపై వడ్డీ రేట్లు తగ్గిపోనున్నాయి.. దీంతో.. బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతీకూల ప్రభావం పడనుంది. 7 రోజుల నుంచి 29 రోజుల కాల పరిమితి ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ వస్తుంది. 30-90 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ, 91-184 రోజుల కాలపరిమితిలోని ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ, 185-సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ మాత్రమే ఇవ్వనున్నారు. ఇక, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితిలోని ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లకు సంబంధించి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఐసీఐసీఐ బ్యాంక్.. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలపరిమితి ఉండే ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీని పొందవచ్చు. మరోవైపు.. 18 నెలు-రెండేళ్ళ కాలపరిమితిలోని ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ రేటు లభించనుండగా.. 2 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 5.15 శాతం, 3-5 సంవత్సరాల్లోని ఎఫ్‌డీలపై 5.35 శాతం, 5-10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీ చెల్లించనుంది బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లు ఈ నెల 21వ తేదీ నుంచే అమలు చేస్తున్నారు.