డల్‌ మార్కెట్‌లో ఐసీఐసీఐ జిగేల్‌

డల్‌ మార్కెట్‌లో ఐసీఐసీఐ జిగేల్‌

మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్‌ నీరసపడింది. ఉదయం నుంచి ఆకర్షణీయ లాభాల్లో ఉన్న ఆసియా మార్కెట్లు క్లోజింగ్‌ వరకు అదే జోష్‌ చూపినా.. మన మార్కెట్‌ మాత్రం అతి కష్టంమీద 10700పైన క్లోజైంది. క్లోజింగ్ సమయానికి పెద్దగా మార్పుల్లేకుండా నిఫ్టి 10,717 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో కూడా పెద్ద మార్పు లేదు.  ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒకదశలో పది శాతం వరకు లాభపడినా... చివరికి 7 శాతం లాభంతో ముగిసింది. బీఎస్‌ఇలో ఇండియన్‌ బ్యాంక్‌, గృహ్‌ ఫైనాన్స్‌, ఐనాక్స్‌ లీజర్‌, బీఈఎంఎల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి ప్రధాన షేర్లలో ఐసీఐఐసీ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. చమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. ఈషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ కూడా లాభాల్లో ముగిశాయి.  ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్‌ రెండు శాతంపైగా నష్టపోగా, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌లు కూడా ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.