మిషన్ కాకతీయ అధ్యయనానికి ఒప్పందం

మిషన్ కాకతీయ అధ్యయనానికి ఒప్పందం

మిషన్ కాకతీయ ఫలితాలు, ప్రభావాల అద్యయనానికి ఇక్రిశాట్ తో, నీటి పారుదల శాఖ తరఫున కాడా కమిషన్ ఒప్పందం కుదుర్చుకోనుంది.  మంత్రి హరీశ్ రావు సమక్షంలో శుక్రవారం కాడా కమిషనర్ మల్సూర్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ సంతకాలు చేయనున్నారు. రెండేళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు వాటి ప్రభావంపై ఇక్రిశాట్ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. తొలి, మలి విడతలో పునరుద్ధరించిన చెరువుల ఫలితాలు, ప్రభావంపై అధ్యయనం జరగనుంది.  చెరువు మట్టి ద్వారా రైతులకు లాభాలు, పంట దిగుబడి అంశాలను పరిశీలించనున్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపును ఇక్రిశాట్ అధ్యయనం చేయనుంది. చెరువు మట్టి ద్వారా పంట దిగుబడిని పరిశీలించనున్నారు.  రైతుకు చెకూర్చిన లాభాలను పరిశీలనలోకి తీసుకోనున్నారు. మిషన్ కాకతీయ ఫలితాలపై ఇప్పటికే నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్కాస్స్ అధ్యయనం చేసింది. మిషన్ కాకతీయ  అమలుతో 2016 ఖరీఫ్ లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా.... 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని అధ్యయనంలో తేలింది. ఈ నిష్పత్తిలో చెరువుల కింద సుమారు 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుందని అంచనా.