మారుమూల ప్రాంతంలో స్కూలు.. గుర్రంపై ఉపాధ్యాయుడి ప్రయాణం...

మారుమూల ప్రాంతంలో స్కూలు.. గుర్రంపై ఉపాధ్యాయుడి ప్రయాణం...

నేటి పిల్లలే రేపటి పౌరులు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయుడు... అమ్మ, నాన్న, కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నా... చదువు కోసం స్కూల్‌కు వెళ్లాల్సిందే.. వారికి ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పి సక్రమమార్గంలో పెట్టాల్సిందే.. అయితే, ఆ ఉపాధ్యాయుడికే కష్టం వస్తే.. కొండల్లో.. ఏదో మారు మూల ప్రాంతంలో ఉన్న ఆ స్కూల్‌కు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తే.. అలాంటి పరిస్థితే ఓ ఉపాధ్యాయుడు ఎదుర్కొంటున్నాడు... విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు... గెమ్మలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.. తన ఇంటి నుంచి సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసే ఆయన.. ఆ గ్రామానికి సరైన దారి కూడా లేకపోవడంతో.. నడుచుకుంటే వెళ్లాల్సిన పరిస్థితి... పాడేరు నుంచి గెమ్మల వరకు బైక్‌పై ఆ తర్వాత కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ దాదాపు 9 కిలోమీటర్లు గుర్రంపై ప్రయాణం చేసి స్కూల్‌కు చేరుకుని పాఠాలు చెబుతున్నారు... ఇప్పుడా ఉపాధ్యాయుడు జీవితాన్ని ఎన్టీవీ ఇదీ జీవితం కార్యక్రమంలో ఆవిష్కరించింది... 

ఆ ఉపాధ్యాయుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి..? అన్ని కష్టాలను ఓడ్చి కూడా ఆ స్కూల్‌కు వెళ్లి ఆయన ఎందుకు పాఠాలు చెబుతున్నారు? అది చేసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...