అలా ఐతే పాకిస్థాన్ కు సహాయం చేస్తాం

అలా ఐతే పాకిస్థాన్ కు సహాయం చేస్తాం

తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పాకిస్థాన్‌ ప్రకటిస్తే.. అందుకు అవసరమైతే భారత్‌ కూడా సాయం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్‌ స్పష్టం చేశారు. ఇటువంటి ప్రకటన పాక్‌ నుంచి వస్తే ఇమ్రాన్‌ ఖాన్ నిజంగానే మోడీ అభిమాని అని‌ మేము నమ్ముతామని అన్నారు. అలాగే, భారత్‌తో పాక్‌ సత్సంబంధాలు కోరుకుంటోందని భావిస్తామని వ్యాఖ్యానించారు. భారత్‌లో మరోసారి ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పాటయితే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మోడీ స్నేహితుడంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై రాజ్‌నాథ్‌ పై విధంగా స్పందించారు.